ఎన్టీఆర్ కోసం కథానాయికను వెతుకుతున్నారు !

ఎన్టీఆర్ తరువాతి సినిమాకోసం సిద్దం అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరికు దశకు చేరుకుంది. మరోవైపు ఎన్టీఆర్ సినిమా కోసం బాగా బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా చినబాబు నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇకపోతే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో చేరిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళైతే బాగుంటుందనే ఉద్దేశ్యంలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఈ నైపథ్యంలో ఇప్పటికే రకరకాల పేర్లు వివినిపించగా తాజాగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. మరి చివరగా ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమా పక్కా స్క్రిప్ట్ తో అందరినీ అలరించే విధంగా తెరకెక్కిస్తున్నారు.