ఇంటర్వ్యూ : త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కోసం తన ప్రాణం పెట్టాడు !

ఇంటర్వ్యూ : త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కోసం తన ప్రాణం పెట్టాడు !

Published on Oct 9, 2018 2:16 PM IST

‘అజ్ఞాతవాసి’ చిత్రం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈచిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమ్మన్నారో ఇప్పుడు చూద్దాం..

అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నేను ఎక్కువగా మాట్లాడలేదు

ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చాలా అయోమయంలో వున్నాను. హరికృష్ణ గారి మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేను ఏం మాట్లాడిన దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువగా మాట్లాడకుండా ఎన్టీఆర్ కు వదిలేశా.

ఎన్టీఆర్ చాలా దైర్యం గా ఆ నిర్ణయం తీసుకున్నాడు

హరికృష్ణ గారు చనిపోయిన తరువాత నేను చినబాబు గారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేద్దామనుకున్నాం. ఎందుకంటె డిసెంబర్ , జనవరి లో చాలా సినిమాలు విడుదల డేట్ ను ప్రకటించుకున్నాయి. కాని రెండు రోజుల తరువాత తారక్ ఫోన్ చేసి నేను షూటింగ్ కు వస్తాను. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలఅన్నాడు. ఆయన మాటలు విని షాక్ అయ్యాం. ఆయన ఏం చెప్పాడో అలాగే చేశాడు.

నేను ఈ సినిమా ద్వారా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక కొత్త కోణాన్ని చూపించనున్నాను

ఇంతకు ముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది. అక్కడి మహిళలు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు. వాళ్ళు పడిన బాధలు ఎలా వుంటాయో ఈచిత్రంలో చూపించాను.

కోబలి , అరవింద సమేత చిత్రాలకు ఎక్కడా పోలిక లేదు

చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈసినిమాకి సంబంధం లేదు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు ఎమోషన్స్ తో సాలిడ్ గా ఉంటుంది ఈచిత్రం.

పెనీవిటి సాంగ్ లో వచ్చే విజువల్స్ చాలా బాగుంటాయి

పెనీవిటి సాంగ్ ను 40శాతం మాత్రమే ఎన్టీఆర్ పైన చిత్రీకరించాం. మిగితా అంత కొండలు మిగితా ప్రదేశాలపై షూట్ చూశాం. సినిమాలో ఈసాంగ్ ను చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు.

ఈచిత్రంలో బలవంతంగా ఇరికించిన కామెడీ ఎక్కడా ఉండదు

నేను మొదటి సారి ఈచిత్రంలో నేను స్టోరీ కి ఏం కావాలో అది మాత్రమే తీశాను . అనవసరమైన కామెడీ, శృతి మించిన రొమాన్స్ లాంటివి ఈచిత్రంలో వుండవు. ఎమోషన్స్ ఈచిత్రానికి హైలైట్ అవుతాయి.

జగపతి బాబు పాత్రను ప్రేక్షకులు ద్వేషిస్తారు .

జగపతి గారు ఈచిత్రంలో అహం పూరితమైన ప్రజలు ఎంత దూరమైన వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారు అనేదే ఆయన పాత్ర బయటపెడుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసాక ఆయన పాత్రని ద్వేషిస్తారు.

నేను అజ్ఞాతవాసి వైఫల్యాన్ని పర్సనల్ గా తీసుకోలేదు !

నేను హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలు తీస్తుంటాను. నేనుఎల్లప్పుడు స్క్రిప్ట్ చదవడం , రాయడం లోనే బిజీ గా వుంటాను. ఆ మూమెంట్ లో ఏదైనా ఎక్సయిటెడ్ ఐడియా వస్తే దాన్ని మీదనే పని చేస్తాను మిగితావి పక్కకు పెట్టేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు