ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడట..?

Published on Apr 1, 2020 7:18 am IST

డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకెళుతున్నారు. అజ్ఞాతవాసి సినిమా పరాజయం తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఆయన అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో బన్నీ మరియు త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ రికార్డ్స్ నమోదు చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సెట్ చేసి పెట్టుకున్నాడు. అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులను కూడా కాదని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కే మొగ్గుచూపారు.

ఈ చిత్రం మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఎటూ ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. త్రివిక్రమ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ విడుదలైన మూడు, నాలుగు నెలల్లో విడుదల కానుంది. కాబట్టి ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల చేయాలని భావిస్తున్నాడట. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని ఎన్టీఆర్ కొరకు సెట్ చేయాలని చూస్తున్న త్రివిక్రమ్, క్యాస్టింగ్ సైతం పలు భాషలకు చెందినవారు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ గా వినబడుతుంది.

సంబంధిత సమాచారం :

X
More