మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం

Published on May 4, 2021 2:06 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ హైప్ ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ విషయమై తెగ చర్చ నడుస్తోంది. మొదట్లో పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. పూజా, మహేష్ గతంలో ‘మహర్షి’ చేయగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆలా వైకుంఠపురములో’ చేసింది పూజా హెగ్డే.

ఈ రెండు సినిమాలు భారీ విజయాల్ని అందుకున్నాయి. అందుకే ఆమెనే రిపీట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు తెర మీదకు వచ్చింది. త్రివిక్రమ్ ఈసారి మహేష్ సరసన కొత్త పేస్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. అందుకే జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే జాన్వీ జాపూర్ ఎంట్రీలోనే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టే. తెలుగునాట ఆమె కెరీర్ కు ఇది మంచి ఆరంభం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2022 వేసవి కానుకగా రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్.

సంబంధిత సమాచారం :