విజయనిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రివిక్రమ్

విజయనిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రివిక్రమ్

Published on Jun 29, 2019 8:47 PM IST

Trivikram

గురువారం ప్రముఖ నటి,దర్శకనిర్మాత అయిన విజయనిర్మల హఠాన్మరణం పొందిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు,ఆమె మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేసారు. ఐతే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొన్ని అనివార్యకారణాలతో హాజరుకాలేకపోయారని సమాచారం.

ఐతే త్రివిక్రమ్ ఇవాళ కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించారు. త్రివిక్రమ్ అక్కడ ఉండగానే మహేశ్ బాబు, నరేశ్ వచ్చారు. వారిద్దరితోనూ త్రివిక్రమ్ మాట్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమలో విజయనిర్మల వంటి ప్రతిభావంతులు ఎంతో అరుదుగా కనిపిస్తారని, నటిగా, దర్శకురాలిగా అనేక ఘనతలు అందుకోవడం ఆమెకే చెల్లిందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు