త్రివిక్రమ్ పేరుమీద ఆండ్రాయిడ్ యాప్!

trivikram
తెలుగు సినీ పరిశ్రమలో దర్శక, రచయితగా త్రివిక్రమ్‌కి ఓ ప్రత్యేక స్థాయి ఉంది. తనదైన భావోద్వేగమున్న కథలతో, తనకు మాత్రమే సాధ్యమవుతుందనిపించే తరహా సంభాషణలతో త్రివిక్రమ్ రచయితగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మధ్యే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ..’ కూడా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సొంతం చేసుకొని త్రివిక్రమ్ స్థాయిని మరింత పెంచింది. ఇక ఇప్పుడు తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన త్రివిక్రమ్‌కు సంబంధించిన సినిమాల వివరాలతో ఒక ఆండ్రాయిడ్ యాప్ రావడం విశేషంగా చెప్పుకోవాలి.

రేపు (నవంవర్ 7న) త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందులో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరిచారు. ఇక అదేవిధంగా రేపు త్రివిక్రమ్ పేరుమీద ఒక వెబ్‌సైట్ కూడా లాంచ్ చేస్తున్నారు. trivikramcelluloid.in డొమైన్ నేమ్‌గల ఈ వెబ్‌సైట్ కూడా రేపే లాంచ్ కాబడుతోంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.