త్రివిక్రమ్, పవన్, నితిన్‌ల కాంబోలో సినిమా!

nithin-trivikram
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ కొట్టిన నితిన్, ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా హీరోగా తన స్థాయిని పెంచేవే కావాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హను రాఘవపూడితో ఓ సినిమా మొదలుపెట్టేసిన ఆయన, తాజాగా మరో క్రేజ్ ప్రాజెక్టును అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నితిన్ హీరోగా నటించే మరో కొత్త సినిమాకు త్రివిక్రమ్ కథ అందించనున్నారట.

ఇక దీనికంటే విశేషమేమంటే ఆ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్ అయిన పవన్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించనుండడం. నితిన్ ఇదే విషయంపై త్వరలోనే ఒక అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్ ఎకౌంట్‍లో త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ న్యూస్‌తో వస్తున్నానని తెలిపారు. ఆ న్యూస్ ఇదే అయి ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తాను ఎంతగానో అభిమానించే వ్యక్తులని చెబుతూ ఉండే నితిన్, వారిద్దరితో కలిసి పనిచేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి.