450పైగా థియేటర్స్ లో ‘తుంగభద్ర’ గ్రాండ్ రిలీజ్

450పైగా థియేటర్స్ లో ‘తుంగభద్ర’ గ్రాండ్ రిలీజ్

Published on Mar 19, 2015 11:17 AM IST

Tungabhadra
‘కథ’ ఫేం అదిత్ అరుణ్, ‘రొమాన్స్’ ఫేం డింపుల్ చోపడే జంటగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. గోగినేని శ్రీ‌నివాస కృష్ణ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ చేసిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు అందరూ ఒకటి రెండు సినిమాలకు పనిచేసిన నటులు మాత్రమే ఉన్నా నిర్మాత సాయి కొర్రపాటి కావడం వలన ఈ సినిమా ప్రమోషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి, అలాగే ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలో కలిపి ఈ సినిమాని సుమారు 450 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.

ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ థియేటర్స్ దొరకడానికి కారణం వారాహి చలన చిత్రంకి ఉన్న బ్రాండ్ నేమ్ కారణం అని అందరూ అంటున్నారు. ప‌ల్లెటూరి రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ స‌త్యరాజ్ కీల‌క పాత్రలో నటించారు. ప్రతిసారి కథని మాత్రమే నమ్మి సినిమా చేసే సాయి కొర్రపాటి ఈ సినిమాను కూడా అలానే చేసాడు. మరి తన గత సినిమాలైన ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ లలానే ఈ ‘తుంగభద్ర’ కూడా విజయం అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే రేపటి దాక ఆగాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు