స్పీడ్ పెంచిన “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా లో ఇద్దరు లేడీ లీడ్ రోల్స్!

Published on Jul 19, 2021 11:30 am IST

రవితేజ హీరోగా నటిస్తున్న తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. రజిష విజయన్ మరియు దివ్యాన్ష కౌశిక్ లు రవితేజ సరసన ఆడి పాడనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ కి సంబందించిన పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే రవి తేజ ను మరొకసారి మాస్ పెర్ఫార్మెన్స్ లో చూసేందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవి తేజ తో తన తొలి చిత్రం కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ వీలైన త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :