రాజమౌళి సినిమాలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ !

Published on Mar 25, 2019 6:04 pm IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ మరియు వరుణ్ ధావన్ లు కీలక పాత్రల్లో ఆర్ఆర్ఆర్ లో కనిపిస్తారట.

ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. హీరోయిన్ల విషయానికే వస్తే చరణ్ కి జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ లను నటిస్తున్నారు.

కాగా నార్త్ ఇండియాలో జరగ బోయే షెడ్యూల్ లో ఎన్టీఆర్ – చరణ్ లతో పాటు అజయ్ దేవగణ్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More