“హను మాన్” ఓటిటి రిలీజ్ పై రెండు వెర్షన్స్?

“హను మాన్” ఓటిటి రిలీజ్ పై రెండు వెర్షన్స్?

Published on Mar 7, 2024 4:03 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “హను మాన్”. మరి మన టాలీవుడ్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా రావడం దీనికి డివోషనల్ ఫ్యాక్టర్ చాలా ప్లస్ కావడం అయితే సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టింది. ఇక థియేటర్స్ లో వసూళ్లతో దుమ్ము లేపిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే అనఫీషియల్ గా సినిమా రిలీజ్ డేట్ ఈ మార్చ్ 8 కే అని టాక్ ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉన్న అంశం ఏమిటంటే హను మాన్ ఓటిటి పార్టనర్ జీ 5 నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. అయితే దీనిపై ఇపుడు రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. మాములుగా రేపు రిలీజ్ అంటే ఈపాటికే క్లారిటీ రావాల్సి ఉంది.

కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా ఓటిటి రిలీజ్ వాయిదా పడిందా అనేది ఒక వెర్షన్ అయితే మరో పక్క హను మాన్ ఓటిటి రిలీజ్ ని సైలెంట్ గానే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి నిజంగానే హను మాన్ వాయిదా పడిందా లేక సైలెంట్ గా వస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు