క్రేజీ..’నాటు నాటు’ కి ఉక్రెయిన్ సైనికుల డాన్స్ వైరల్.!

Published on May 30, 2023 1:08 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఎన్నో అంశాల్లో గ్లోబల్ ఆడియెన్స్ ని మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో అయితే సెన్సేషన్ గా మారిన అంశాల్లో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సాంగ్ ‘నాటు నాటు’ కోసం చెప్పక్కర్లేదు.

మరి లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ కి ఉక్రెయిన్ ఆర్మీ సైన్యం డాన్స్ చేయడం వైరల్ గా మారింది. అయితే ఈ సాంగ్ ని నిజానికి ఉక్రెయిన్ లోనే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దేశానికీ చిత్ర యూనిట్ కి కూడా మంచి బంధం అప్పుడే ఏర్పడింది. పైగా గత కొన్నాళ్ల కితం యుద్ధ సమయంలో అయితే రామ్ చరణ్ అక్కడ తనకి తన బాడీ గార్డ్ గా వర్క్ చేసిన అతనికి సాయం అందించినట్టుగా తెలిసింది.

పైగా చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో ఉక్రెయిన్ కోసం స్పందించారు. మరి ఇప్పుడు ఈ దేశ సైన్యం అయితే తమ వెర్షన్ లో ఇంట్రెస్టింగ్ గా నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేయడం వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :