విజయ్ “మాస్టర్” ప్రీమియర్ కు ఊహించని టీఆర్పీ.!

Published on Apr 22, 2021 4:00 pm IST

కోలీవుడ్ ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. విజయ్ కెరీర్ లోనే భారీ హైప్ తో అనేక చిక్కుల అనంతరం మోస్ట్ అవైటెడ్ గా ఈ చిత్రం విడుదలై విజయం సాధించింది.

అయితే ఈ చిత్రం ఇటీవల తమిళ్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యగా దానికి ఊహించని టీఆర్పీ మరియు టెలివిజన్ ఇంప్రెషన్స్ వచ్చాయి. విజయ్ నటించితిన్ గత చిత్రాలు ‘బిగిల్’, ‘సర్కార్’ రేటింగ్స్ కూడా మాస్టర్ క్రాస్ చెయ్యలేదు. బిగిల్ కు 21.9 టీఆర్పీ రేటింగ్ రాగా సర్కార్ కు 21.7 రేటింగ్ వచ్చింది. కాగా తేరి సినిమాకు 18 రాగా మాస్టర్ కు 17.1 టీఆర్పీ మాత్రమే వచ్చింది.

అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేయడం మళ్ళీ టెలివిజన్ లో రావడంతో ఇంత తక్కువ వచ్చి ఉండొచ్చు. అలాగే ఈ చిత్రం టీఆర్పీ లోనే కాకుండా టెలివిజన్ ఇంప్రెషన్స్ లో కూడా విజయ్ గత చిత్రాలను దాటలేకపోయింది. విజయ్ గత చిత్రం సర్కార్ కు 16.9 మిలియన్స్ ఇంప్రెషన్స్ రాగా మాస్టర్ 13.75 మిలియన్స్ తో సరిపెట్టుకుంది.

సంబంధిత సమాచారం :