అన్‌స్టాపబుల్: “పుష్పరాజ్” స్పెషల్ ఎపిసోడ్‌కి టైమ్ ఫిక్స్..!

Published on Dec 25, 2021 7:08 pm IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్ ఎపిసోడ్‌కి మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుంది. అయితే ఈ షోకు పుష్పరాజ్ అదేనండి అల్లు అర్జున్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బన్నీతో పాటు రష్మిక మందన్నా, సుకుమార్‌ సైతం షోలో సందడి చేశారు.

ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే పుష్పరాజ్ చేసిన హడావుడిని ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఆహా గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఎపిసోడ్ రేపు రాత్రి 8:00 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.

సంబంధిత సమాచారం :