బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 అనౌన్స్ మెంట్!

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 అనౌన్స్ మెంట్!

Published on Apr 9, 2024 4:06 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ (Balakrishna) చివరిసారిగా భగవంత్ కేసరి చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తదుపరి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 చిత్రం లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడు ఉగాది పండుగ సందర్భంగా ఆహా వీడియో ఓటిటి ప్లాట్ ఫారం ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ ను చేయడం జరిగింది.

అన్‌స్టాపబుల్‌ విత్ NBK షో ఆహా వీడియో లో చాలా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఇప్పుడు నాల్గవ సీజన్ కి సమయం ఆసన్నమైంది. నాల్గవ సీజన్ కి కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విత్ ఎ ట్విస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సెలబ్రెటీ టాక్ షో నాల్గవ సీజన్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు