సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

sai-daram

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రం ఈరోజు ఉదయం దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈరోజు నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటి వరకూ పూర్తి స్థాయి మాస్ హీరోగా కనిపించిన తేజ్ ఈ చిత్రంలో ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడట. ఈ లుక్ కోసం తేజ్ ముంబై వెళ్లి మేకోవర్ చేయించుకున్నాడని, దర్శకుడు గోపీచంద్ మల్లినేని సైతం తేజ్ పాత్రను చాలా డిఫరెంట్ గా రూపొందించారని తెలుస్తోంది.