ఇండస్ట్రీ తరపున ప్రధానిని ప్రశ్నించిన ఉపాసన

ఇండస్ట్రీ తరపున ప్రధానిని ప్రశ్నించిన ఉపాసన

Published on Oct 20, 2019 10:12 AM IST

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ నడపడంలో తనదైన పాత్ర పోషిస్తూనే అనేక సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తుంటారు. తాజాగా మహాత్మాగాంధీ 150వ జయంతికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు విందు ఇచ్చారు. ఈ వేడుకకు షారుఖ్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్ లాంటి బడా స్టార్లతో పాటు ఇతర ఒక మోస్తారు స్టార్ల వరకు అందరికీ ఆహ్వానం అందింది.

కానీ దక్షిణాది నుండి నిర్మాత దిల్ రాజు మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుండి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. చిత్ర పరిశ్రమకు దక్షిణాది పరిశ్రమలు ఎంతటి విశిష్టమైన సేవలు అందిస్తున్నారో దేశం మొత్తానికి తెలుసు. అయినా ఇలా నిర్లక్ష్యం చూపడం ఏమిటని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎవరూ బయటపడకపోయినా ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో ప్రధాని మోడీని సున్నితంగా ప్రశ్నించారు.

తన ట్వీట్ నందు ‘మోదీగారు దక్షిణాదిన ఉండే మాకు మీరంటే ఎంతో గౌరవం. మీరు ప్రధానిగా ఉండటం పట్ల మేము గర్విస్తున్నాము. గొప్ప వ్యక్తులను గుర్తుచేసే కార్యక్రమాలను కేవలం హిందీ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితం చేసి, దక్షిణాది నటీనటులను వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని భావిస్తున్నాను. చాలా బాధతో ఈ నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను అన్నారు. ఉపాసన ఇలా కుండ బద్దలు కొట్టినట్లు విషయాన్ని చెప్పడంతో నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు