ఉపాసనను ఫిదా చేసిన రామ్ చరణ్

Published on Jul 22, 2019 5:30 pm IST

రామ్ చరణ్, ఉపాసన.. పరిశ్రమలో ఈ జంట ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తుంటారు. ఇద్దరి మధ్య అన్యోన్యత అలా ఉంటుంది మరి. ఇప్పటికే పలుసార్లు చరణ్ మీద తన ప్రేమను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఉపాసన తాజాగా కూడా ఒక పోస్ట్ పెట్టారు. జూలై 20న ఉపాసన పుట్టినరోజు కావడంతో చరణ్ ఆమెను తీసుకుని మాల్దీవ్స్ వెళ్లారు.

అక్కడే పుట్టినరోజు వేడుకలు చేశారు. ఇదంతా చరణ్ ప్లాన్. చరణ్ తన బర్త్ డేను ప్రత్యేకంగా జరపడంతో ఫిదా అయిన ఉపాసన ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ మిస్టర్ సి.. నా ప్రతిరోజును ప్రత్యేకంగా మార్చినందుకు నీకు థ్యాంక్స్. నీ ప్రేమ నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది అంటూ మనసులో సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :