‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ?
Published on Feb 28, 2017 8:35 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పవన్, శృతి ల పై చిత్రీకరించాల్సిన పాటల మినహా టాకీ పార్ట్ మొత్తం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. పాటల చిత్రీకరణ కోసం టీమ్ త్వరలోనే విదేశాలకు కూడా వెళ్లనుంది. ఇదిలా ఉంటే మార్చి నెలాఖరున రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఆడియో వేడుక జరపకుండా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఈవెంట్ మార్చి 12 వ తేదీ పైన జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే పాటలు కూడా మార్చి మొదటి వారంలోనే ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తారట. గతంలో మెగా హీరోల సినిమాలన్నీ ఇదే పద్దతిని పాటించి గ్రాండ్ సక్సెస్ సాధించడంతో ‘కాటమరాయుడు’ కి కూడా ఇదే పద్దతిని అవలంభిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘గోపాల గోపాల’ ఫేమ్ కిశోర్ కుమార్ పార్థసాని (డాలి) డైరెక్ట్ చేస్తున్నాడు.

 
Like us on Facebook