24 డైరక్టర్ తో నాని 24 !

Published on Dec 2, 2018 11:03 am IST


నాని ‘మనం ,24’ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన 24వ చిత్రంలో నటించనున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఈచిత్రంసెట్స్ మీదకు వెళ్లనుంది. తర్వలోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

ఇక నాని ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ఈ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే తన 24 వచిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం :