బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ మూవీ !

Published on Feb 4, 2019 3:49 pm IST

బాహుబలి 2 హిందీ వెర్షన్ బాలీవుడ్ లో బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ఈ చిత్రం ఫుల్ రన్ లో అక్కడ 500కోట్లను కలెక్ట్ చేసింది. అయితే తాజాగా విడుదలైన యూరి సర్జికల్ స్ట్రైక్ ,బాహుబలి 2 రికార్డు ను క్రాస్ చేసింది. విషయానికి వస్తే జనవరి 11 న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తో సూపర్ రన్ ను కొనసాగిస్తూ 200కోట్ల క్లబ్ కి చేరువైయింది.

ఈచిత్రం 23 వరోజు 6.53 కోట్లు అలాగే 24 రోజు 8.71 కోట్ల ను వసూళ్లను రాబట్టింది. అయితే ఇంతకుముందు బాహుబలి2 23వ రోజు (6.35 కోట్లు) 24 వ రోజు (7.80 కోట్లు) రాబట్టడం తో తాజాగా యూరి ఆ రికార్డు ను క్రాస్ చేసింది.

స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ కు ఈఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందించింది. 2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను బేస్ చేసుకొని తెరకెక్కింది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :