కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ ఆడియో, రిలీజ్ డేట్స్

కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ ఆడియో, రిలీజ్ డేట్స్

Published on Mar 19, 2015 3:28 PM IST

Uttama-Villain
యూనివర్సల్ స్టార్, ఉలగనాయగన్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’. ఈ సినిమా తమిళ ఆడియో లాంచ్ ఇటీవలే చెన్నైలో జరిగింది. ఇప్పటికే తమిళంలో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ రోజు తెలుగులో ఉత్తమ విలన్ ట్రైలర్ ని లాంచ్ చేసారు. అలాగే ఈ సినిమా రిలీజ్ రిలీజ్ డేట్స్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఉత్తమ విలన్ తెలుగు ఆడియోని మార్చి 28న రిలీజ్ చేసి, సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాని సి కళ్యాణ్ రిలీజ్ చేయనున్నాడు. సుమారు 8 కోట్ల రూపాయలకి సి. కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు