ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయనున్న యువీ క్రియేషన్స్ !

uv-creations
తెలుగు పరిశ్రమలో ఉన్న నమ్మకమైన, బలమైన నిర్మాణ సంస్థల్లో యువీ క్రియేషన్ ఒకటి. ప్రభాస్ – కోరటాల శివల చిత్రం ‘మిర్చి’ తో ప్రారంభమైన వీరి జర్నీ ఆతరువాత ‘రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి చిత్రాలతో విజయవంతంగా సాగింది. తాజాగా సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సంస్థ త్వరలో ఇద్దరు పెద్ద సినిమాలు చేయనుందని తెలుస్తోంది.

అందులో ఒకటి ప్రభాస్ సినిమా కాగా మరొకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ 2017 ఆరంభానికి ఆ సినిమా పనులు పూర్తి చేసి దర్శకుడు సుజిత్ తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మించనుంది. అలాగే 2017 మధ్యలో చరణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశారట. ఇకపోతే ఈ సంస్థ ప్రస్తుతం దర్శకుడు అశోక్ డైరెక్షన్లో అనుష్క మెయిన్ లీడ్ గా లేడీ ఓరియంటెడ్ సినిమా ‘భాగమతి’ ని నిర్మిస్తోంది.