అమెజాన్ ప్రైమ్ లోకి వకీల్ సాబ్.. డేట్ కూడా వచ్చేసింది ..!

Published on Apr 27, 2021 7:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ మరియు ఓవరాల్ కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. అయితే ఈ సినిమాకు మొదటి వీకెండ్‌లో వచ్చిన కలెక్షన్స్ ఆ తర్వాత కాస్త తగ్గిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి.

ఈ క్రమంలో వకీల్ సాబ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తొలుత ఏప్రిల్ 26న ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుందంటూ ముందు నుంచి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అమెజాన్ ప్రైమ్ కూడా ఓ వీడియో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

సంబంధిత సమాచారం :