భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “వలిమై” గ్లింప్స్.!

Published on Sep 24, 2021 11:00 am IST


సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఎప్పుడు నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో స్టార్ హీరో థలా అజిత్ కుమార్ నటించిన “వలిమై” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం లో మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని నిన్న ఫీస్ట్ గా తీసుకొచ్చారు. అజిత్ నుంచి మరో ఊహించని మాసివ్ వీడియో ఇది అని చెప్పాలి. తనదైన మార్క్ సీక్వెన్స్ లు లుక్ తో థలా అదరగొట్టేసాడు.

ఇక అజిత్ నుంచి వీడియో వస్తే దాని రెస్పాన్స్ నే వేరే లెవెల్లో ఉంటుంది. మరి అందుకు తగ్గట్టుగానే భారీ రెస్పాన్స్ తో ఇది దూసుకెళ్తుంది. ఇప్పటికే ఇండియన్ ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేస్తూ బ్రేక్ చేస్తూ ఈ గ్లింప్స్ వెళుతుంది. మొత్తానికి మాత్రం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమాకి అజిత్ అభిమానులు గట్టి ఫీడ్ బ్యాక్ నే ఇస్తున్నారు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :