‘వాల్మీకి’ విడుదల తేదీ ఖరారు !

Published on Jul 23, 2019 7:10 pm IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 13వ తేదీన సినిమా విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు.

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ టీజర్‌ సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచింది. ముఖ్యంగా ప్రీ టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :