సందీప్ కిషన్ “మైఖేల్” కోసం బరిలోకి జయమ్మ!

Published on Jan 20, 2022 7:02 pm IST

పలు భాషల్లో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం మైఖేల్ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలకమైన యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం లోకి మరొక పవర్ ఫుల్ లేడీ చేరారు.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆమె పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఇప్పటికే క్రాక్ మరియు నాంది చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రాక్ చిత్రం లో జయమ్మ పాత్ర తో ఎంతో ఆకట్టుకున్న ఈ నటి, సమంత నటిస్తున్న యశోద చిత్రంలో సైతం కీలక పాత్రలో నటించేందుకు ఎంపికైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. మైఖేల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :