వైరెటీ టైటిల్ తో రాబోతున్న యంగ్ హీరో !

Published on Dec 5, 2018 2:00 am IST

యంగ్ హీరో సందీప్ కిషన్ మళ్లీ కామెడీనే నమ్ముకుంటున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి మంచి ఎంటర్ టైనర్ తో హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయి కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ఒక సినిమా ప్లాన్ చేశాడు.

కాగా, ఈ సినిమాకు ‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిలే ఫన్నీగా ఉండటంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. డిసెంబర్ 14 నుండి మొదలుకానున్న ఈ సినిమాలో హన్సిక కథానాయకిగా నటించనుంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ తాజా చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది. ఈ సినిమాలో తమన్నా, నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ తెరకెక్కించిన ఈ చిత్రానికి లియాన్ జోన్స్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :