గ్లోబల్ ఛార్ట్స్ లో అదరగొడుతున్న “వరిసు” రంజితమే.!

గ్లోబల్ ఛార్ట్స్ లో అదరగొడుతున్న “వరిసు” రంజితమే.!

Published on Nov 20, 2022 10:00 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అయితే మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రంజితమే బయటకి వచ్చింది.

అయితే ఈ సాంగ్ వచ్చిన వెంటనే ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ కాగా యూట్యూబ్ లో అయితే మ్యూజిక్ ని రూల్ చేస్తుంది. గ్లోబల్ గా ఈ సాంగ్ ఇప్పుడు గ్లోబల్ గా అయితే టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతూ నిలిచింది. దీనితో ఈ అంశాన్ని సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు. ఇక ఈ సాంగ్ అయితే ప్రస్తుతం 55 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేసి 60 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు