ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘అంతరిక్షం’ !

Published on Dec 9, 2018 12:29 pm IST

‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది.

కాగా, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. స్పేస్ నేపథ్యంలోని వచ్చే విజువల్స్ తో పాటు వరుణ్ తేజ్ మరియు అదితి రావు కూడా చాలా బాగా ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పూర్తి థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిందని అర్ధమవుతుంది.

ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటిస్తుండగా అదితిరావ్ హైదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :