తొలిప్రేమ సినిమాలో వరున్ తేజ్ పాత్ర ఇదే !

తొలిప్రేమ సినిమాలో వరున్ తేజ్ పాత్ర ఇదే !

Published on Jan 25, 2018 9:07 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా టైటిల్ తో వరుణ్ తేజ్ నటించబోతున్న తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సాఫ్ట్ వేర్ రోల్ లో కనిపించబోతున్నాడు. సినిమా అధికభాగం అమెరికా లో చిత్రీకరించడం జరిగింది. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే పాపులర్ అయ్యింది. నేపధ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉండబోతోందని సమాచారం. ఫీల్ గుడ్ లవ్ స్టోరి తో రానున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోందని చిత్ర యూనిట్ ఇటివల జరిగిన ఆడియో ఫంక్షన్ లో వెల్లడించారు. ఫిదా సినిమా తరువాత వరుణ్ నటించిన సినిమా ఇదేకావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు వరుణ్ తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెప్తున్నాడు.

తాజా వార్తలు