వరుణ్ “వాల్మీకి” శాంపిల్ చూపిస్తాడట…!

Published on Jun 22, 2019 11:58 am IST

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ “వాల్మీకి”. తమిళ హిట్ మూవీ “జిగర్తాండా” కి రీమేక్ గా తెలుగులో నిర్మిస్తున్నారు. ఇటీవలే యాగంటి,బెంగుళూరు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ మూవీ ప్రీ టీజర్ ఈనెల 24న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంధర్బంగా ఓ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ అందిస్తున్నారు. కామెడీ,క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More