విజయ్ దేవరకొండ చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ హీరో వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వం లో VD 12 అనే చిత్రాన్ని చేస్తున్నారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా VD12 టీమ్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండటం తో ఫ్యాన్స్ అంతా కూడా అప్డేట్ కోసం ఎదురు చూశారు. వారికి నిరాశే మిగిలింది. వైజాగ్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుంది అని, ఒక భారీ సీక్వెన్స్ కి సంబందించి ఈ షూటింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే త్వరలో స్నీక్ పీక్ ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది.
Wishing the Supremely Talented, our beloved The #VijayDeverakonda a very Happy Birthday! – Team #VD12 ❤️#HBDTheVijayDevarakonda ✨@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/8siio4EcgN
— Sithara Entertainments (@SitharaEnts) May 9, 2024