యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. VD 14 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ తో గతంలో టాక్సీవాలా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు.
ఇది 1854 మరియు 1878 మధ్య కాలంలో జరిగే కథ అనే పోస్టర్ లో పేర్కొన్నారు. ఇతిహాసాలు రాయబడలేదు. అవి హీరోల రక్తంలో నిక్షిప్తమై ఉన్నాయి అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ది లెజెండ్ ఆఫ్ కర్స్డ్ ల్యాండ్ గా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ లో ఉన్న వివరాలు అభిమానులని అలరిస్తున్నాయి. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. త్వరలో ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.