250 థియేటర్లలో విడుదలకానున్న ‘వెంకటాపురం’ !
Published on May 10, 2017 1:27 pm IST


‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ నటించిన తాజా చిత్రం ‘వెంకటాపురం’. ట్రైలర్లతో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’ మేనియాలో రిలీజవుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకాస్త పెరిగింది. సినిమా మే 12న విడుదలకానుండటంతో నిర్మాతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. చిత్రాన్ని మొత్తంగా 250 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

వీటిలో నైజాం ఏరియాలో 80 థియేటర్లు ఉండగా ఓవర్సీస్లో 30 థియేటర్లున్నాయి. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని స్వయంగా వైజాగ్లో రిలీజ్ చేయనుండగా నైజాం ఏరియాలో నిర్మాలైన తుము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ లు డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. రాహుల్ సరసన మహిమ మక్వాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించగా అచ్చు సంగీతం సమకూర్చారు.

 
Like us on Facebook