నారప్ప స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ – వెంకటేష్

Published on Jul 25, 2021 5:09 pm IST

విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన నారప్ప చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అయితే ఈ చిత్రం ను చూసిన ప్రతి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే వెంకటేష్ నట విశ్వరూపం పై పొగడ్తలు కురిపించారు. అయితే ఈ చిత్రం పై మరొకసారి విక్టరీ వెంకటేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ ఒక్క హీరో కూడా ఒంటరిగా ఎదగలేడు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే నారప్ప చిత్రం బృందం పట్ల చాలా గ్రేట్ ఫుల్ గా ఫీల్ అయినట్లు తెలిపారు. నారప్ప ను స్ట్రాంగ్ గా మరియు పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసినందుకు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను వెంకటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :