రానా నాయుడు: నెగిటివ్ పాత్రను పోషించడం నా వరకూ రిఫ్రెష్ మార్పు – విక్టరీ వెంకటేష్

Published on Mar 2, 2023 9:07 pm IST

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడుతో స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా వున్నారు. ఈ సిరిస్ యాక్షన్ క్రైమ్ డ్రామా అభిమానులకు థ్రిల్లింగ్ వాచ్ అని భరోసా ఇచ్చింది. వెంకటేష్ దగ్గుబాటి కెరీర్ లో రానా నాయుడు ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇది లాంగ్ స్టొరీ టెల్లింగ్ ప్రపంచంలోకి వెంకటేష్ మొదటి ప్రయత్నం మాత్రమే కాదు, వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు గారి అబ్బాయి రానాతో కలసి నటిస్తున్న తొలి ప్రాజెక్ట్. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వెంకటేష్, ఈ సిరీస్‌లో నాగనాయుడు పాత్రలో కనిపించనున్నారు. తన అబ్బాయితో తలపడే పాత్రది. తండ్రి, కొడుకులుగా ఇద్దరూ పోటాపోటీ పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సిరిస్ కోసం పనిచేసిన తన అనుభవం, స్ట్రీమింగ్ ఫార్మాట్‌ విశేషాలని పంచుకున్నారు వెంకటేష్. “ఇది ఇప్పటివరకు నాకు ఒక ఎక్సయిటింగ్ ప్రయాణం. సిరీస్‌లో పనిచేయడానికి, ఒక చిత్రంలో పనిచేయడానికి చాలా తేడా వుంటుంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంది” అని చెప్పారు. నెగిటివ్ పాత్రను పోషించడం నా వరకూ రిఫ్రెష్ మార్పు. క్రాఫ్ట్ యొక్క కొత్త కోణాలను అన్వేషించడానికి దోహదపడింది. “సంక్లిష్టమైన పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. రానా నాయుడు లో చేసింది కూడా అలాంటి పాత్రే. పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం వున్న పాత్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ ఈ పాత్ర తృప్తిని ఇచ్చింది” అని అన్నారు.

రానాతో స్క్రీన్ పంచుకోవడం గురించి చెబుతూ, “రానా కి ఎదురుగా వార్ చేయడం అంత సులువు కాదు. నటుడిగా నాకిది ఒక సవాల్. ఆఫ్-స్క్రీన్ మాకు గొప్ప ఈక్వేషన్ వుంది. బాబాయ్ అబ్బాయి కంటే మేము స్నేహితులలాంటివాళ్ళం. కానీ తెరపై, ఒకరంటే ఒకరికి పడని తండ్రి కొడుకలుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం. ఒక నటుడిగా ఆర్ట్ లో ఇది చాలా సంతోషకరమైన భాగం. ఇప్పటివరకు అనుభవించని పరిస్థితులను, భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అవుతారు. ఇది ఖచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం. మేము కలిసి పనిచేశాము. మా పాత్రలకు జీవం పోయడానికి ఓకరికొకరు సూచనలు తీసుకున్నాము” అని అన్నారు.

రానా నాయుడు లో వెంకటేష్ ని ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని పాత్రలో ఆయన్ని చూస్తారు. గ్రిప్పింగ్ కథాంశం, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ ఫార్మెన్స్ కోసం, మంచి క్రైమ్ డ్రామాను ఇష్టపడే అందరూ తప్పక ఈ సిరిస్ చూడాలి. నాగా తన కుటుంబంతో తిరిగి కలవగలడా లేదా అతను తన కొడుకు రానా అంతిమ ప్రత్యర్థి అని నిరూపిస్తాడా? మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే రాబోయే రానా నాయుడు సిరిస్ లో తెలుసుకోండి.

సంబంధిత సమాచారం :