మే నుండి వెంకటేష్ మల్టీస్టారర్ సినిమా !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న మల్టీస్టారర్ సినిమా మేలో మొదలు కానుంది. వెంకటేష్ నటించనున్న ఈ సినిమాలో మరో హీరోను ఒప్పించే పనిలో పడ్డాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొదట సెకండ్ హీరోగా వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని వరుణ్ ఆ సినిమా చెయ్యట్లేదని సమాచారం.

సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. త్వరలో నటీనటుల ఎంపిక జరగనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కామెడి మేజాత్ హైలెట్ గా ఉండబోతుందని సమాచారం. ఈ నెల నుండి వెంకటేష్ తేజ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత మే అనిల్ రావిపూడి సినిమా ఉండబోతోంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమా చెయ్యబోతున్నాడు ఈ సీనియర్ హీరో.