వెంకీ మామ అమెజాన్ లో చూడమంటున్న వెంకీ

Published on Jan 21, 2020 3:38 pm IST

గత ఏడాది చివర్లో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగా థియేటర్స్ లో భలే సందడి చేశారు. డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చివరికి ప్రాఫిటబుల్ వెంచర్ గా మిగిలింది. మామ అల్లుళ్ళ ఎమోషన్స్ మరియు కామెడీ తెరపై బాగానే పేలాయి. దర్శకుడు కే ఎస్ రవీంద్ర దర్శకత్వంలో స్వర్గీయ రామానాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. కాగా కొద్దిరోజుల క్రితం వెంకీ మామ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

కాగా విక్టరీ వెంకటేష్ వెంకీ మామ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూసి ఆనందించండి అని ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. థియేటర్స్ లో మిస్సయినవారు అమెజాన్ ప్రైమ్ లో చూసి ఆస్వాదించండి అని అంటున్నారు. ఇక వెంకటేష్ అసురన్ తెలుగు రీమేక్ షూట్ కి రెడీ అవుతున్నారు. రాయలసీమలోని అనంతపురంలో ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుందని సమాచారం. అసురన్ రీమేక్ లో వెంకటేష్ వయసుకొచ్చిన ఇద్దరు కొడుకులకు తండ్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :