వెంకీ, తేజాల సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !
Published on Oct 19, 2017 11:01 am IST

ఈ ఏడాది ఆరంభంలో ‘గురు’ సినిమాతో మెప్పించిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ త్వరలోనే మరొక సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ట్రాక్లో పడ్డ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు.

ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ 2వ వారంలో మొదలయ్యే అవకాశాలున్నాయట. మరి సీనియర్ హీరో, సీనియర్ దర్శకుడు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో ఇతర నటీనటులెవరు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook