‘వెంకీ మామ’ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి !

Published on Aug 25, 2019 10:48 pm IST

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా రామోజీ ఫిలిమ్‌ సిటీలో వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్ మధ్య పాటను చిత్రీకరిస్తుండగా.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ కాలు స్వల్పంగా గాయపడటంతో ఈ సినిమా షూటింగ్‌ ను మధ్యలో ఆపేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మొదటివారంలో తిరిగిప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది.

ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి ఇటివలే చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై మొత్తానికి ఈ వీడియో బాగానే అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :