“వకీల్ సాబ్” ఓటిటి విడుదలపై వేణు శ్రీరామ్ స్పందన.!

Published on May 2, 2021 4:59 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అంజలి, అనన్య నాగళ్ళలు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ నెల 9న విడుదల కాబడిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది.

కానీ మళ్ళీ కోవిడ్ తీవ్రత ఎక్కువ అవుతూ వస్తుండడంతో ఇదే నెలలోనే డిజిటల్ గా కూడా విడుదల అయ్యిపోయింది. అయితే ఇంత త్వరగా విడుదల కావడం పట్ల దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ తాను ఉండే జగిత్యాలలో ప్రతీ ఒక్కరి ఇంతా వకీల్ సాబ్ చూస్తున్నారని తన తల్లి ఊర్లో వెళ్తుంటే అన్ని ఇళ్ల నుంచి కూడా వకీల్ సాబ్ సౌండ్స్ వినిపించేవని చెప్పారని అలాగే అప్పుడు థియేటర్స్ వరకు వెళ్లలేని వారి అందరి గడపలకి ఓటిటి ద్వారా వకీల్ సాబ్ చేరింది అని వేణు శ్రీరామ్ తెలిపారు.

సంబంధిత సమాచారం :