“పుష్ప”లో ఆమెది కీలక రోల్ అట.!

Published on Apr 23, 2021 12:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ ఆండ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు శరవేగంగా అన్ని జాగ్రత్తలతో షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఇటీవలే కొంతమంది కీలక నటులు కూడా యాడ్ అయ్యారు. అయితే వారిలో గ్లామరస్ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.

అయితే ఈ చిత్రంలో అనసూయ చేసే రోల్ పైనే ఇంట్రెస్టింగ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఆమెకు సాలిడ్ రోల్ ను సుకుమార్ డిజైన్ చేశారట. గత చిత్రం రంగస్థలం లో ఎమోషనల్ గా ఆమె రోల్ ఉంటే ఈసారి పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మరి సుకుమార్ ఎలాంటి పాత్రలో అనసూయను చూపించనున్నారో చూడాలి.. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :