లెజెండరీ బాలీవుడ్ నటుడు కన్నుమూత !
Published on Dec 4, 2017 6:57 pm IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్ కన్నుమూశారు. 1938 మార్చి లో జన్మించిన శశి కపూర్ మరణించేనాటికి ఆయన వయసు 79 సంవత్సరాలు. శశి కపూర్ నాలుగు సంవత్సరాల చిన్న వయసు నుండే తండ్రి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన నాటకాల్లో నటించేవారు. ఆ తరువాత తండ్రి స్థాపించిన పృథ్వీ థియేటర్స్ ను చుసుకోనేవారు. కాలక్రమేణా సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారాయన.

సినీ రంగానికి విశేష సేవలందించిన శశి కపూర్ కు భారత గవర్నమెంట్ పద్మభూషణ్, దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ ప్రదానం చేసింది. శశి కపూర్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 123 తెలుగు.కామ్ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తోంది.

 
Like us on Facebook