హాట్ టాపిక్ గా విజయ్, అజిత్ రెమ్యునరేషన్ లు.!

Published on Feb 2, 2023 4:02 pm IST

తమిళ సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో ఇళయ దళపతి విజయ్ మరియు హీరో అజిత్ ల క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలిసిందే. మరి ఇద్దరి బాక్సాఫీస్ వసూళ్లు కానీ సోషల్ మీడియా రికార్డుల్లో గాని ఎప్పుడు నుంచి గట్టి పోటీ అయితే వీరిలో కనిపిస్తుంది. మరి రీసెంట్ గా వీరి సినిమాలు “వారిసు” మరియు “తునివు” చిత్రాలు రిలీజ్ కాగా మంచి హిట్ కూడా అయ్యాయి. అయితే ఈ పోటీ పై ఇద్దరు హీరోలు కూడా సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా అయితే తమిళ్ మీడియా ఇద్దరి హీరోల రెమ్యునరేషన్ కోసం ఇంట్రెస్టింగ్ అంశం బయటపెట్టింది. మరి వీరిలో అయితే విజయ్ కన్నా అజిత్ రెమ్యునరేషన్ నే ఎక్కువ అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు విజయ్ ఓ సినిమాకి 80 కోట్ల మేర ఛార్జ్ చేయగా అజిత్ మాత్రం 90 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

కానీ ఇప్పుడు విజయ్ తన 67వ సినిమాకి మాత్రం తమిళ నాట రికార్డు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఒక్క సినిమాకి మాత్రం విజయ్ ఏకంగా 130 కోట్ల భారీ మొత్తాన్ని అందుకుంటున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వీరి రెమ్యునరేషన్ లు ఇప్పుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం :