పూరి కోసం ఆ దర్శకుడ్ని పక్కనబెడుతున్న విజయ్ ?

Published on Jul 23, 2019 9:29 pm IST

యువ హీరో విజయ్ దేవరకొండ డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంకో రెండేళ్ల వరకు సరిపడా ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే దర్శకులు ముందుగానే ఆయనతో ఒప్పందాలు చేసేసుకుంటున్నారు. ఇలా దేవరకొండతో ఇంతకుముందే సినిమాను ప్లాన్ చేసుకున్న దర్శకుల్లో శివ నిర్వాణ కూడా ఒకరు.

‘మజిలీ’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆయనతో సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మధ్యలోకి పూరి రావడంతో శివ నిర్వాణ ప్రాజెక్ట్ వాయిదాపడేలా ఉందట. పూరి తన ‘జన గణ మన’ కథను దేవరకొండతో చేయాలని అనుకున్నారని, దేవరకొండ సైతం పూరి సినిమా అనగానే ఒప్పేసుకున్నాడని, అందుకోసం శివ నిర్వాణ ప్రాజెక్టును కొన్నాళ్ళు ఆపడానికి రెడీ అయ్యారని వినికిడి. మరి వీటిలో నిజమెంత తేలాలంటే విజయ్ లేదా పూరి నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు ఆగాల్సిందే. ఇకపోతే విజయ్ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :