ఇంటర్వ్యూ : విజయ్ దేవ‌ర‌కొండ‌ – నచ్చిన దాని గురించి పోరాడండి అనే చెప్పే సినిమా ఇది !

Published on Jul 22, 2019 7:23 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న రాబోతున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్న హీరో విజయ్ దేవ‌ర‌కొండ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి విజయ్ దేవ‌ర‌కొండ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం..

ప్రమోషన్స్ విషయంలో న్యూ ట్రెండ్ సెట్ చేసారు ?

చాలామంది ఏ హీరో చేయని విధంగా ప్రమోషన్స్ చేస్తున్నావ్ అని అంటున్నారు. నేను ఏదో కొత్తగా చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రమోషన్స్ చెయ్యట్లేదు. నాకు నచ్చిని విధంగా ప్రమోట్ చేద్దాం అని అలా చేశాం. అలాగే ఈ సినిమా ఆల్బమ్ కూడా నాకు చాల బాగా వచ్చింది. అలా మొత్తానికి బెంగుళూరు అండ్ కేరళలో కూడా ప్రమోట్ చేశాం.

మీరు గతంలో నటించిన ఏ సినిమాకి చెయ్యని విధంగా ఈ ఒక్క సినిమాకే ఎందుకు ఇలా ప్రమోట్ చేస్తున్నారు ?

ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కూడా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. సినిమా అవుట్ ఫుట్ కూడా చాల బాగా వచ్చింది. అందుకే సినిమాని బాగా జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాము.

డియర్ కామ్రేడ్ గురించి చెప్పండి ?

డియర్ కామ్రేడ్ ఎమోషనల్ ఫిల్మ్. సినిమా చూశాక… మనకు ఒక ఎమోషన్ అండ్ ఒక ఆలోచన మిగిలిపోతుంది. సినిమాలో నా క్యారెక్టర్ గాని, అలాగే రష్మిక క్యారెక్టర్ గాని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. మా రెండు క్యారెక్టర్ ల జర్నీనే ఈ సినిమా. నచ్చిన దాని గురించి పోరాడండి అనే చెప్పే సినిమా ఇది.

సినిమాలో స్టూడెంట్స్ అండ్ పాలిటిక్స్ లాంటి అంశాలు ఎక్కువుగా ఉంటాయా ?

సినిమాలో నా క్యారెక్టర్ స్టూడెంట్ లీడర్. కానీ సినిమాకి పాలిటిక్స్ కి అలాగే స్టూడెంట్ లీడర్ కి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే అవి కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఉంటాయి.

ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. టెన్షన్ గా ఉందా ?

నాలుగు భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. బాహుబలి కూడా కన్నడలో రిలీజ్ కాలేదు. కానీ ఈ సినిమా కన్నడలో అలాగే మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుందనే టెన్షన్ అయితే ఉంది. కానీ సినిమా అవుట్ ఫుట్ చూశాక.. సినిమా మీద నమ్మకం ఉంది.

మీరు భవిష్యత్తులో హిందీ సినిమాల్లో కూడా నటిస్తారా ?

తెలుగులో నటించడానికే నాకు టైం సరిపోవట్లేదు. అయితే హిందీలో మంచి కథ వస్తే.. ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే బాంబోయ్ కి వెళ్ళి అక్కడ ఉండి సినిమా చేయడం అంటే పెద్దగా ఇంట్రస్ట్ లేదు.

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమా చేస్తున్నాను. అలాగే ఓ కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయబోతున్నాను. మరో రెండు కథలు విన్నాను బాగున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More