యుఎస్ఏ ఆడియన్స్ కి ‘లైగర్’ దేవరకొండ స్పెషల్ విషెస్ …!

Published on Aug 25, 2022 3:00 am IST


టాలీవుడ్ రౌడీ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ఫస్ట్ మూవీ పెళ్లి చూపులతో పెద్ద విజయం అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ గ్రాండ్ సక్సెస్ తో హీరోగా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ అక్కడి నుండి వరుసగా పలు సినిమాలు చేస్తూ మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా అయన తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మూవీ లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారీ స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు, నార్త్, యుఎస్ఏ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే లైగర్ ప్రీ టికెట్ బుకింగ్స్ సూపర్ గా ఉండడంతో యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా యుఎస్ఏ ఫ్యాన్స్, ఆడియన్స్ కోసం విజయ్ ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేసారు. హీరోగా చేసిన తొలి సినిమా పెళ్లి చూపులు నుండి అక్కడి ఆడియన్స్ తన పై చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని, అలానే లేటెస్ట్ మూవీ లైగర్ కి కూడా ప్రీమియర్ బుకింగ్స్ అదిరిపోతుండగా ఫ్యాన్స్, ప్రేక్షకుల ప్రేమతో అది 1 మిలియన్ కి చేరితే టీమ్ అందరూ మరింత హ్యాపీ అన్నారు. ఇక మూవీ తప్పకుండా అందరిలీ అలరించి సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అన్నారు విజయ్ దేవరకొండ.

సంబంధిత సమాచారం :