ముంబైలో మాస్ రెస్పాన్స్ కి ఆశ్చర్యపోయిన “లైగర్”..!

Published on Jul 23, 2022 1:00 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి పలు క్రేజీ చిత్రాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “లైగర్” కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన మస్సివ్ ట్రైలర్ తో అయితే సినీ వర్గాలు సహా సోషల్ మీడియాలో లైగర్ రచ్చ లేచింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకండా లైగర్ టీం కి ముంబై సిటీ లో కూడా అదిరే రెస్పాన్స్ చిత్ర యూనిట్ కి వచ్చింది.

దీనితో విజయ్ దేవరకొండ ఈ ఊహించని రెస్పాన్స్ పై తన స్పందనను తెలియజేసాడు. తాను చాలా సార్లు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యానికి లోనయ్యానని ఇప్పుడు కూడా అలాగే లోనయ్యానని అలాగే ఇప్పుడు ముంబై లో జరిగింది అని తాను తెలిపాడు. లైగర్ ఈవెంట్ లో ఆ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని ముంబై ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పాడు. అంతే కాకుండా ఈ ఈవెంట్ కి వచ్చిన తమ స్పెషల్ గెస్ట్ రణ్వీర్ సింగ్ కూడా విజయ్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు.

సంబంధిత సమాచారం :