పవన్ కంటే విజయ్ దేవరకొండ 20 రెట్లు బెటర్ – ఆర్జీవీ


పవన్ కళ్యాణ్ కు సంబందించిన సినిమా, రాజకీయ విషయాల్లో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుని సంచలన స్టేట్మెంట్స్ ఇస్తూ అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలకు దిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పవన్ ను ఉద్దేశించి మరో స్టేట్మెంట్ విసిరారు. ఈసారి ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నటుడు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండను పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు వర్మ.

విడుదలకు ముందు ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ ను సపోర్ట్ చేసిన వర్మ విడుదల తర్వాత సినిమాను, దర్శకుడు చిత్రాన్ని తీసిన విధానాన్ని, విజయ్ నటనను పొగుడుతూ ఇప్పటికే పలు పోస్టులు చేసి తాజాగా సినిమాను అనలైజ్ చేస్తూ మధ్యలో విజయ్ నటనా స్థాయిని తెలిపేందుకు పవన్ కళ్యాణ్ ను కొలమానంగా తీసుకుని లుక్స్, ఛరీష్మా పరంగా విజయ్ పవన్ కన్నా 10 రెట్లు మేలు ఇక నటన విషయానికొస్తే 20 రెట్లు పవన్ కళ్యాణ్ కన్నా మంచి పెర్ఫార్మర్ అన్నారు. అలాగే విజయ్ కు రేలా పవర్ స్టార్ అనే బిరుదును ఇవ్వాలని కూడా సూచించారు.

ఇప్పటికే గతంలో పలు సార్లు వర్మ చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో మండిపడ్డ అభిమానులు ఈ స్టేట్మెంట్స్ పట్ల కూడా సోషల్ మీడియాలో గట్టిగానే స్పందిస్తున్నారు. మరి ఈ ఉదంతాన్ని వర్మ ఎంతవరకు తీసుకెళతారో చూడాలి.